ఇంకా మూడు రోజుల్లో ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సీజన్ ఈ నెల 9 న ప్రారంభం అయి మే 30 న ముగుస్తోంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే బీసీసీఐ (BCCI) తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ధనాధన్ సందడి ఫ్యాన్స్ లో కన్పిస్తుంది. సీజన్ ప్రారంభమైన తర్వాత అది పీక్ స్టేజికి చేరడం గ్యారెంటీ.

Vi ఘట్టం ఏదైనా తాను దిగనంతే వరకే అన్నట్లుగా రన్ మెషీన్, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ 2021 లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఓ లుక్కేద్దాం.

ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో‌ విరాట్‌ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేయడం ద్వారా సింగిల్‌ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ లిఖించాడు. ఆ సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీలు బాది ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు.

ఐపీఎల్ టోర్నీలో ఆల్‌టైమ్‌ అత్యధిక పరుగులు రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పటివరకూ కోహ్లీ 5878 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేష్ రైనా (Suresh Raina) (5368), డేవిడ్ వార్నర్ (David Wrner) (5254), రోహిత్ శర్మ (Rohit Sharma) (5230) లు కోహ్లీ తర్వాత ఉన్నారు. గతేడాది రైనా లీగ్ ఆడకపోవడంతో కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కోహ్లీ యావరేజ్‌ 46.90 గా ఉంది. ఇది విరాట్ మిగతా పొజిషన్ల యావరేజ్‌ కంటే ఎక్కువ. మిగతా పొజిషన్లలో అతడి యావరేజ్‌ 34,0 మాత్రమే.

ఇక, ఓవరాల్ గా టీ 20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 269 పరుగులు అవసరం. బెంగళూరు (చాంపియన్స్‌ లీగ్‌ టీ 20, ఐపీఎల్‌ కలుపుకుని) తరఫున 50 సార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించడానికి ఇంకా నాలుగు హాఫ్‌ సెంచరీలు అవసరం.

ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్కును చేరడానికి ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికు వరకూ 192 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. మరో 8 మ్యాచ్ లు ఆడితే ఆ ఫీట్ ను కూడా అందుకుంటాడు కోహ్లీ.

ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేరడానికి కోహ్లీకి..ఇంకా 122 పరుగులు అవసరం. అలాగే, 50 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించడానికి ఇంకా ఆరు హాఫ్ సెంచరీలు అవసరం. ఇలా పలు రికార్డులను కొల్లగొట్టడానికి కోహ్లీ రెడీ అయ్యాడు.

మరోవైపు, ఇంతవరకు ఆర్బీబీ ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు. ఈ సారైనా టైటిల్ ను ఖాతా వేసుకుని ఆలోటును తీర్చుకుంటుందో లేదో చూడాలి. ఈ సారి కూడా పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంది కోహ్లీసేన.

Titre associé :
ఐపీఎల్‌ 2021: కోహ్లీ ఇంకో 122 పరుగులు చేస్తే ..
IPL 2021: ఈ సీజన్ లో కింగ్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే .. మరో …
క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ కింగ్ మహేంద్ర సింగ్ …
IPL 2021 లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు !!
ఇప్పటికే ఎన్నో రికార్డులు .. ఊరిస్తున్న మరిన్ని ఘనతలు

Ref: https://telugu.news18.com