
హైదరాబాద్: టీ 20 ఫార్మాట్ అనగానే అందరికీ బ్యాట్స్‌మెన్ ధనాధన్ ఆటతీరే గుర్తుకువస్తుంది. కొత్త కొత్త షాట్లతో బ్యాట్స్‌మెన్ ఆకట్టుకుంటారు. పొట్టి ఫార్మాట్ వచ్చాక అనేక కొత్త షాట్లు అభిమానుకుల ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం కోట్ల మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాట్స్‌మెన్ మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఐపీఎల్లో అత్యధికంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’లు అందుకున్న బ్యాట్స్మన్ల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను అందుకున్న ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. 169 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీ .. ఇప్పటివరకు 23 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. 156 ఇన్నింగ్స్‌లలో 151,91 స్ట్రైక్ రేట్‌తో 4849 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోనీ మాదిరిగానే .. ఏబీ కూడా గొప్ప ఫినిషర్ అనిపించుకున్నాడు.
ఏబీ డివిలియర్స్ తరువాత కరేబియన్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 22 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. 131 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన గేల్ .. 4772 పరుగులు చేశాడు. స్కోర్ స్కోర్ 175 నాటౌట్. కరేబియన్ స్టార్ ఐపీఎల్ టోర్నీలో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు బాదాడు. మొదట ఆర్సీబీ తరపున ఆడిన గేల్ .. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. 2018 లో పంజాబ్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది.
అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న జాబితాలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అతడు అందుకున్నాడు. రోహిత్ మొత్తం 200 మ్యాచ్‌లు ఆడి 5230 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. మొదటగా డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ .. సుదీర్ఘ కాలంగా ముంబైకి ఆడుతున్నాడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లతో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకుని నాలుగో స్థానంలో ఉన్నాడు. 142 మ్యాచులలో 5254 రన్స్ బాదాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఐపీఎల్ చరిత్రలో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలుచుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. మహీ 204 మ్యాచులలో 4632 పరుగులు చేశాడు. స్కోర్ స్కోర్ 84 నాటౌట్. 23 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో మొత్తానికి టాప్ -5 లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు.
Les joueurs remporteront au moins 1 prix M.O.M dans la plupart des saisons IPL
11 – Rohit
11 – Dhoni
10 – ABD
10 – Raina
9 – Warner
9 – Gayle
9 – Watson
8 – Pollard
8 – Yusuf
8 – Gambhir
8 – Rayudu
7 – Sehwag
7 – Mishra
Il reste 2 jours pour # IPL2021
ఇక ప్రతి ఐపీఎల్ సీజన్లలో కనీసం ఒక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రోఫీ అందుకున్న జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 11 ఐపీఎల్ సీజన్లలో రోహిత్ ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ కూడా 11 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ (10), సురేష్ రైనా (10), డేవిడ్ వార్నర్ (9), క్రిస్ గేల్ (9), షేన్ వాట్సన్ (9) వరుసగా ఉన్నారు.
Titre associé :
– Jabardasth Artist Vinod: మళ్లీ పోలీస్ స్టేషన్‌కి జబర్దస్త్ నటుడు .. అసలేం …
– IPL 2021: ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్లు …
– IPL 2021: ఐపీఎల్లో అత్యధిక & # 39; మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ & # 39; లు అందుకుంది వీరే …
– ఐపీఎల్: కుర్రాళ్లు కుమ్మేశారు ..!
Ref: https://telugu.mykhel.com