ICC T20 World Cup Dernière mise à jour: నేడు ఏకంగా 1 లక్షా 26 వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు అక్టోబర్‌లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) టీ 20 వరల్డ్ కప్ నిర్వహించడానికి ప్లాన్ చేసింది.

Coupe du monde ICC T20: భారత్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ 19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటగా ఐపీఎల్ 2021 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఇటీవల స్పష్టం చేయడం తెలిసిందే. తాజాగా టీ 20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

నిన్న దేశ వ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు రాగా, నేడు ఏకంగా 1 లక్షా 26 వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు అక్టోబర్‌లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) టీ 20 వరల్డ్ కప్ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా ప్రభావాన్ని అధికంగా చవిచూస్తున్న దేశం భారత్ కనుక టీ 20 ప్రపంచ కప్ (Coupe du monde T20) వేదిక మారనుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ గవర్నింగ్ బాడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అల్లార్‌డైస్ దీనిపై స్పందించారు. మరో 6 నెలల సమయం ఉందని, ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రతి దేశంలో జరగనున్న ప్రధాన ఈవెంట్ల గురించి ఐసీసీ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. అయితే టీ 20 వరల్డ్ కప్ కోసం ప్రత్యామ్నాయ వేదిక గురించి ఐసీసీ ఇప్పటివరకూ యోచించలేదని తెలిపారు. సరైన సమయంలో మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. 8 జట్లు పాల్గొననున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ఏప్రిల్ 9 నుంచి బయో బబుల్ వాతావరణంలో ప్రారంభం కానుంది.

ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే నిర్ణయానికి ఐసీసీ మద్దతు తెలిపిందని జెఫ్ అల్లార్‌డైస్ గుర్తుచేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తక్కువ సమయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి టీ 20 వరల్డ్ కప్ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదిక గురించి చర్చ జరగలేదన్నారు. బయోబబుల్ వాతావరణంలో ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై సైతం ఐసీసీ పరిశీలిస్తుందని వివరించారు.

Pour నుంచి అంతర్జాతీయం వరకు .. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A à Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Ref: https://zeenews.india.com