చెన్నై: ఉసేన్‌ బోల్ట్‌ .. ఈ పేరు తెలియని వారుండరు. స్ర్పింట్‌ విభాగంలో తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన బోల్ట్‌ రన్నింగ్‌ రారాజుగా అభివర్ణిస్తారు. అయితే కోహ్లి, డివిలియర్స్‌లనుద్దేశించి బోల్ట్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు విషయంలోకి వెళితే .. కొన్ని రోజుల క్రితం పూమా క్రికెట్‌ ప్రమోషన్‌లో భాగంగా కోహ్లి, డివిలియర్స్‌లు ప్రాక్టీస్‌ సందర్భంగా రన్నింగ్‌ రేస్‌ పెట్టుకున్నారు. ఆ రేస్‌లో విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ ను దాటి దేవదత్‌ పడిక్కల్‌ ముందుకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్‌ అయింది. తాజాగా ఈ వీడియోపై ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ మధ్య ట్విటర్‌లో చర్చ నడిచింది. మరోసారి కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రన్నింగ్‌ రేస్‌ పెట్టాలని .. ఇద్దరిలో ఎవరు గెలిస్తే అతని ఫిట్‌నెస్‌ అంత మెరుగ్గా ఉన్నట్లని తెలిపారు.

అయితే వీరి సంభాషణ మధ్యలో అనూహ్యంగా ఆర్‌సీబీ జెర్సీ వేసుకొని వచ్చిన బోల్ట్‌ .. కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రేస్‌ పెట్టినా .. ఎప్పుడు నా వెనకే ఉంటారు .. అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. ‘ఆర్‌సీబీ చాలెంజర్స్‌ .. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా .. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తేవాడిని నేనే అనుకుంటా .. కోహ్లి, డివిలియర్స్‌ ఎప్పుడు నా వెనకే అంటూ కామెంట్‌ చేశాడు. కాగా ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9 న ముంబై వేదికగా డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.

* మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది,
* అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, * ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి,
* వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Nouvelles Telugu |

Dernières nouvelles en ligne |

Aujourd’hui Rasi Phalalu en Telugu |

Astrologie hebdomadaire |

Nouvelles politiques en telugu |

Dernières nouvelles de l’Andhra Pradesh |

Nouvelles politiques de l’AP |

Telugu News TV EN DIRECT |

Nouvelles de Telangana |

Nouvelles de Telangana Politics |

Crime News |

Actualités sportives |

Nouvelles de cricket en Telugu |

Critiques de films Telugu |

Nouvelles Telugu International |

Galeries de photos |

Nouvelles de YS Jagan |

Nouvelles de Hyderabad |

Dernières nouvelles d’Amaravati |

Nouvelles de CoronaVirus Telugu |

Bigg Boss 4 Telugu

Ref: https://www.sakshi.com