హైదరాబాద్: ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మైదానంలో అతను చేసిన పరుగులు, ఘనతలే అతని ఎంతటి విలువైన ఆటగాడో తెలియజేస్తాయి. అతని ఆటకు ముగ్దులైన అభిమానులు విరాట్‌ను ముద్దుగా క్రికెట్ రారాజు అని పిలుచుకుంటారు. అయితే గూగుల్ ఏకంగా విరాట్ కోహ్లీకి ‘క్రికెట్‌ కింగ్‌’అనే బిరుదే ఇచ్చింది. Roi «roi du cricket» అని సెర్చ్ చేస్తే విరాట్ కోహ్లీ, అతని బయో వస్తుంది. అతని వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, ముద్దు పేరుతో సహా ఎత్తును కూడా తెలియజేస్తుంది.

ప్రస్తుతం ఈ గూగులమ్మ సమాచారంతో విరాట్ అభిమానులు, ముఖ్యంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎప్పటికీ కింగేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గూగుల్ సెర్చ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని గూగుల్ వెల్లడించింది. ధోనీ కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టైటిళ్లన్నిటినీ అందించిన ఏకైక కెప్టెన్‌‌గా నిలిచాడు.

ఇప్పటికీ వరల్డ్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే .. చాలా మంది మహీ పేరునే సూచిస్తారు. మాజీ క్రికెటర్లు సైతం మైదానంలో మహీ రచించే వ్యూహాలకు ఫిదా అవుతారు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ దూరమైన ధోనీ .. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఇప్పటికే మూడు టైటిళ్లు అందించిన మహీ .. ఈసారి కూడా చాంపియన్ నిలిపి గౌరవంగా ఆటకు అల్విదా ప్రకటించాలనుకుంటున్నారు. ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే గత సీజన్ మినహా .. ప్రతీ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరింది. వ్యక్తిగతంగాను ధోనీకి మంచి రికార్డు ఉంది.

అయితే గూగులమ్మ ధోనీకి ఐపీఎల్ కింగ్ అనే బిరుదిచ్చింది. Roi «roi d’IPL» అని సెర్చ్ చేస్తే మహేంద్ర సింగ్ ధోనీ పేరు సూచిస్తుంది. అతని వ్యక్తిగత వివరాలను కూడా సూచిస్తుంది. ఇక గూగులమ్మ ఇచ్చిన బిరుదుకు ధోనీ ఫ్యాన్స్‌తో పాటు సీఎస్‌కే తెగ ఆనందపడుతున్నారు. నిజంగానే మహీ .. ఐపీఎల్ కింగ్ అని పేర్కొంటున్నారు.

ఐపీఎల్ 204 మ్యాచ్‌లు ఆడిన మహీ..41 సగటుతో 4632 రన్స్ చేశాడు. ఈ జాబితాలో మహీ 8 వ స్థానంలో ఉండగా .. 5878 రన్స్‌తో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (5368), డేవిడ్ వార్నర్ (5254), రోహిత్ శర్మ (5230), శిఖర్ ధావన్ (5,197), ఏబీ డివిలియర్స్ (4849), క్రిస్ గేల్ (4772) మహీ కన్నా ముందున్నారు.

Titre associé :
ఐపీఎల్‌ 2021: కోహ్లీ ఇంకో 122 పరుగులు చేస్తే ..
క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ కింగ్ మహేంద్ర సింగ్ …
IPL 2021 లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు !!
ఇప్పటికే ఎన్నో రికార్డులు .. ఊరిస్తున్న మరిన్ని ఘనతలు

Ref: https://telugu.mykhel.com